అతిగా నీళ్లు తాగితే అంత ప్రమాదమా? తక్కువగానే కాదు, అతిగా నీళ్లు తాగినా కూడా ఆరోగ్యానికి ప్రమాదమే. సాధారణంగా మనిషి రోజూ ఎనిమిది నుంచి పది గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుంది. రోజుకు ఆరు గ్లాసుల కన్నా తక్కువ నీళ్లు తాగితే డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. పదిగ్లాసుల కన్నా ఎక్కువ నీరు తాగితే, ఆ నీటినంతా వడపోసి బయటికి పంపించాల్సిన భారం కిడ్నీలపై పడుతుంది. దీనివల్ల కణాల్లో వాపు ఏర్పడే అవకాశం ఉంది. నీరు ఎక్కువ తాగితే తలనొప్పి మొదలవుతుంది. ఒకంతట తగ్గదు. పైగా వాంతి వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రక్తం లవణాలను గ్రహించే శక్తి కోల్పోయి శరీరభాగాల పనితీరులో తేడాలు వస్తాయి. గుండె కండరాలపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. తద్వారా రక్తపోటు కూడా పడిపోతుంది. అతిగా నీళ్లు తాగడం వల్ల ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల మూత్రంలో పొటాషియం శరీరం నుంచి బయటకు వెళ్లిపోయే ప్రమాదం ఉంది. నీరు అతిగా తాగితే కాళ్ల నొప్పులు, ఛాతీనొప్పి మొదలువుతుంది. అవసరమైనంత నీరే తాగడం అలవాటు చేసుకోవాలి.