తొంభైలలో టాలీవుడ్ లో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఉదయ్ కిరణ్.



వరుస విజయాలతో కెరీర్ పరంగా దూసుకుపోయాడు.



ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సంచలనాలు సృష్టించాడు. 



అతి చిన్న వయసులోనే నంది అవార్డు అందుకొని రికార్డుల్లోకెక్కాడు. 



'చిత్రం' సినిమాతో మొదలైన తన సినీ ప్రయాణం 'నువ్వు నేను', 'మనసంతా నువ్వే' ఇలా వరుస విజయాలతో ముందుకు సాగింది.



కానీ సడెన్ గా ఆయన కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. 2004 తర్వాత ఆయనకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి.



అదే సమయంలో కుటుంబ సమస్యలు కూడా రావడంతో మానసికంగా చాలా స్ట్రగుల్ అయ్యాడు ఉదయ్ కిరణ్. 



ఏమైందో తెలియదు కానీ 2014లో తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.



ఆయన మరణించి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ అభిమానులు ఆయన్ను మర్చిపోలేకపోతున్నారు. 



ఈరోజు ఉదయ్ కిరణ్ ఎనిమిదో వర్ధంతి కావడంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.