కిమాడ్... ఇదొక దేశీ వైన్
తాగితే ఎన్నిలాభాలో

కిమాడ్ అనే దేశీ వైన్‌కు తూర్పు భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.

పండుగలకు, వివాహ సమయాల్లో దీన్ని లీటర్ల కొద్దీ తయారుచేసి బంధుమిత్రులంతా ఆనందంగా తాగుతారు.

నీళ్లు, ఆకుపచ్చ యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక టీ బ్యాగు, పంచదార, నారింజ రసం, నారింజ ఎండు తొక్కలు, లిక్కర్ (జిన్ లేదా వోడ్కా) కలిపి కిమాడ్ ను తయారుచేస్తారు.

చలికాలంలోనే దీన్ని ఎక్కువగా తాగుతారు. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వంటివి కలిపి చేయడం వల్ల శరీరానికి వెచ్చదనం కలుగుతుంది.

ఆల్కహాల్ తాగే కన్నా దీన్ని తాగడం చాలా మంచిది. దాల్చిన చెక్క, లవంగం ఉండడం వల్ల గొంతుకు ఉపశమనం కలుగుతుంది.

గొంతు, ముక్కు, ఊపిరితిత్తుల్లో పట్టే శ్లేష్మాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. దీనివల్ల జలుబు, ముక్క దిబ్బడ, గొంతు నొప్పి వంటి సమస్యలు కలగవు.

మీ రోగనిరోధక శక్తిని సహజంగానే పెంచుతుంది. చల్లనివాతావరణంలో బ్యాక్టిరియా, వైరస్‌ల వల్ల కలిగే అనారోగ్యాల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.