లాల్ సింగ్ చడ్డా చిత్ర బృందం ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌ను సందర్శించింది. ఆమీర్ ఖాన్, నాగచైతన్య, మోనాజ్ సింగ్, దర్శకుడు అద్వైత్ చందన్ నేషనల్ వార్ మెమోరియల్‌కు వెళ్లారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాలో జంటగా నటించారు. నాగచైతన్య కీలకమైన అతిథి పాత్ర పోషించారు. తన పాత్ర నిడివి 20-30 నిమిషాల మధ్యలో ఉండనుందని చైతన్య తెలిపారు. హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్‌కు అధికారిక రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ఏప్రిల్ 14వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా... కేజీయఫ్ 2తో క్లాష్ వచ్చిందని వాయిదా వేశారు. లాల్ సింగ్ చడ్డా కోసం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాను 2023 సంక్రాంతికి వాయిదా వేశారు.