పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్ ‘షెహజాదా’ ప్రమోషన్లలో బిజీగా ఉంది. తెలుగు బ్లాక్‌బస్టర్ ‘అల వైకుంఠపురంలో’ బాలీవుడ్ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. పూజా హెగ్డే కనిపించిన అమూల్య పాత్రలో కృతి నటించనుంది. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్నాడు. దీని ట్రైలర్ కూడా ఇటీవలే రిలీజ్ అయింది. కృతి సనన్ చేతిలో మరో రెండు భారీ సినిమాలు ఉన్నాయి. టైగర్ ష్రాఫ్ సరసన ‘గణపత్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో కృతి సనన్ యాక్షన్ సన్నివేశాలు కూడా చేసినట్లు సమాచారం. ఇక ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ కూడా ఈ సంవత్సరమే విడుదల కానుంది. Images Credit: Kriti Sanon Instagram