కృతి సనన్ ఇటీవలే ‘మిమి’ సినిమాకు గానూ జాతీయ అవార్డు అందుకున్నారు.

కానీ తాను ఒక సందర్భంలో కెమెరా ముందు నిలుచోవడానికి భయపడినట్లు చెప్పారు.

‘హీరో పంతి’ సినిమాతో కృతి సనన్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.

దానికి ముందు ఒక ఫ్యాషన్ షోలో తనకు జరిగిన సంఘటన గురించి కృతి చెప్పారు.

50 మంది ముందు తనకు అవమానం జరిగిందని పేర్కొన్నారు.

తన మొదటి ర్యాంప్ షోలో ఒక లేడీ కొరియోగ్రాఫర్ తనతో దారుణంగా ప్రవర్తించిందన్నారు.

అనుకోకుండా స్టెప్ సరిగ్గా వేయలేకపోయానని, అప్పుడు తన మీద అరిచారని తెలిపారు.

అది ఒక ఫామ్ హౌస్‌లో జరిగిన ఫ్యాషన్ షో అని పేర్కొన్నారు.

తన హీల్స్ గడ్డిలో ఇరుక్కోవడం కారణంగా స్టెప్స్ వేయలేకపోయానన్నారు.

ఆ తర్వాత తనకు బాధ కలిగినా, ఫీల్డ్‌ను మాత్రం వదిలేయలేదన్నారు.