కృతి సనన్ బాలీవుడ్ సినిమా ‘గణపథ్’ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.

అక్టోబర్ 20వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

టైగర్ ష్రాఫ్ ఈ సినిమాలో హీరోగా నటించారు.

టైగర్ సరసన కృతి నటించడం ఇది మొదటిసారి కాదు.



2014లో ‘హీరో పంతి’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు.

వారిద్దరికీ అదే మొదటి బాలీవుడ్ సినిమా.

కృతి తెలుగులో రెండు సినిమాలు చేశారు.

‘1 నేనొక్కడినే’, ‘దోచేయ్’ సినిమాల్లో కృతి నటించారు.

అప్పటి నుంచి మళ్లీ స్ట్రయిట్ తెలుగు సినిమా చేయలేదు.

ఈ సంవత్సరం ప్రభాస్ సరసన ‘ఆదిపురుష్’లో కనిపించారు.