ప్రముఖ నటి కృతి కర్బంద తన లేటెస్ట్ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇందులో తను చాలా అందంగా ఉన్నారు. 2009లో తెలుగు సినిమా ‘బోణీ’తో తను ఇండస్ట్రీలో బోణీ కొట్టారు. ‘తీన్‌మార్’లో వసుమతి పాత్ర తనకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో తను సినిమాలు చేశారు. 2015లో వచ్చిన ‘బ్రూస్‌లీ: ది ఫైటర్’ తెలుగులో తనకు ఆఖరి సినిమా. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కృతి కనిపించలేదు. 2021లో వచ్చిన ‘14 ఫిరే’ తన చివరి సినిమా. అనంతరం మరే సినిమాలోనూ నటించలేదు.