బ్రాహ్మణ యువకుడిగా నాగశౌర్య, మోడ్రన్ అమ్మాయిగా షిర్లే సేతియా నటించిన 'కృష్ణ వ్రింద విహారి' సినిమా ఎలా ఉంది? కథ: సాంప్రదాయాలు పాటించే ఫ్యామిలీ అబ్బాయి కృష్ణ (నాగశౌర్య). ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన వ్రింద (షిర్లే)ను ప్రేమలో పడేస్తాడు. వ్రిందకు ఓ సమస్య ఉంది. దాన్ని దాచిపెట్టి, తనలో లోపం ఉందని కుటుంబ సభ్యులను నమ్మించి పెళ్లి చేసుకుంటాడు. కృష్ణ ఆడిన అబద్ధం ఎన్ని చిక్కులు తెచ్చింది? కుటుంబంలో ఎన్ని కలహాలు వచ్చాయి? అనేది సినిమా. ఎలా ఉందేంటి? : నాని 'అంటే సుందరానికీ' సినిమాలో కాన్సెప్ట్, మేజర్ ట్విస్ట్... ఈ సినిమాలో కాన్సెప్ట్, ట్విస్ట్ ఒక్కటే. సేమ్ టు సేమ్. 'అంటే సుందరానికీ' తరహాలో ఉండటంతో కథ పరంగా కిక్ ఏమీ ఉండదు. ఫస్టాఫ్ కామెడీ కూడా వర్కవుట్ కాలేదు. 'కృష్ణ వ్రింద విహారి' సెకండాఫ్ బావుంది. తల్లి భార్య మధ్య హీరో నలిగిపోయే సీన్స్ చాలామందికి కనెక్ట్ కావచ్చు. నాగశౌర్య బాగా చేశారు. ఫైట్స్‌లో సిక్స్ ప్యాక్ చూపించారు. షిర్లే పర్వాలేదు. 'వెన్నెల' కిశోర్, బ్రహ్మాజీ నవ్వించారు. 'కృష్ణ వ్రింద విహారి' పాటలు, సినిమాటోగ్రఫీ కూడా బావున్నాయి. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫీల్ ఇస్తాయి. 'కృష్ణ వ్రింద విహారి' కంప్లీట్ ఎంటర్టైనర్ చూసిన శాటిస్ ఫ్యాక్షన్ ఇవ్వదు. జస్ట్ ఏవరేజ్ సినిమా.