సింపుల్ గా ‘కృష్ణ ముకుంద మురారి’ సీరియల్ హీరోయిన్ పెళ్లి వరుసగా బుల్లితెర సెలబ్రిటీల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. రీసెంట్ గా నటుడు మానస్ స్వప్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా ‘కృష్ణ ముకుంద మురారి’ హీరోయిన్ ప్రేరణ సంసార జీవితంలోకి అడుగు పెట్టింది. శ్రీపాద అనే యువకుడిని కన్నడ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు చెప్తున్నారు. సీరియల్స్ కంటే ముందు ప్రేరణ కన్నడ సినిమాల్లో నటించింది. పలు సినిమాల్లో నటించినా గుర్తింపు రాకపోవడంతో సీరియల్స్ చేయడం మొదలు పెట్టింది. 'కృష్ణ ముకుందా మరారీ' సీరియల్ లో అమాయకురాలైన కృష్ణ పాత్రలో నటించి బాగా పాపులర్ అయ్యింది. All Photos Credit: प्रेrana kambam/Instagram