‘కొత్త బంగారు లోకం‘ హీరోయిన్ ఇలా మారిపోయింది ఏంటి? కొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఇలా వచ్చి, అలా వెళ్తారు. ఎంత స్పీడుగా ఎదుగుతారో, అంతే స్పీడుగా కనుమరుగైపోతారు. అలాంటి వారిలో ఒకరు అందాల తార శ్వేత బసు ప్రసాద్. ‘కొత్త బంగారులోకం’ మూవీతో తెలుగు తెరకు పరిచయమై చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. అనుకోని ఘటనలతో జీవితంలో అనేక ఇబ్బందులు పడింది. దర్శకుడు రోహిత్ ను వివాహం చేసుకొని, ఏడాది కాకుండానే విడాకులు తీసుకుంది. ప్రస్తుతం మూవీ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న శ్వేతను చూసి అందరూ జాలి పడుతున్నారు. Photos Credit: Shweta Basu Prasad/Instagram