పసుపు మంచిదో, కల్తీదో ఇలా తెలుసుకోండి



ప్రతి కూరలో పసుపు పడనిదే రుచి, రంగు రాదు.



మనం వాడే పసుపు స్వచ్ఛమైనదో కాదో కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది .



ఒక టీ స్పూన్ పసుపు పొడిని నీటిలో కలపండి. ఆ పసుపంతా నీటి దిగువకు చేరి, లేత పసుపు రంగులోకి మారితే అది నిజమైన స్వచ్ఛమైన పసుపు.



కల్తీ పొడి అయితే నీటిలో వేసిన తర్వాత ముదురు పసుపు రంగులోకి మారిపోతుంది.



పసుపు ప్రకాశవంతమైన అత్యంత పసుపు రంగుతో మెరుస్తూ ఉంటే దానిలో మెటానిల్ రసాయనం కలిపారేమో చెక్ చేయాలి.



మీ అరచేతిలో చిటికెడు పసుపును వేసి బొటనవేలితో గట్టిగా 20 సెకండ్ల పాటు మర్దన చేయండి.



ఆ తర్వాత చేతులను దులిపేసుకోండి. మీ చేతిపై పసుపు మరక అలానే ఉంటే అది స్వచ్ఛమైన పసుపు అని అర్థం చేసుకోవాలి.



ఒక గాజు కూజాలో గోరువెచ్చటి నీరు, పసుపు వేయండి. కాసేపు దాన్ని వదిలేయండి. పసుపు పొడి అడుగుభాగాన చేరితే ఆ పసుపు స్వచ్ఛమైనదని అర్థం.