ఉదయం నిద్రలేవగానే ఘుమఘుమలాడే ఓ కాఫీ తాగారంటే అద్భుతంగా ఉంటుంది కదా.

రోజుకి రెండు లేదా మూడు కప్పుల కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.

కాఫీ తాగడం వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధి నుంచి బయటపడొచ్చని పలు పరిశోధనలు నిరూపించాయి.

కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది మెదడులోని న్యూరోట్రాన్సిస్ లను పెంచి శక్తిని ఇస్తుంది. అలసటని దూరం చేస్తుంది.

రెగ్యులర్ గా కాఫీ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు.

శరీరంలో కొవ్వుని కరిగించి బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. అయితే అది మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే సాధ్యం.

డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సహకరిస్తుందని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

గుండె జబ్బులు, స్ట్రోక్, హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం తక్కువగా ఉంటుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి.

వ్యాయామం చేసే ముందు కాఫీ తాగడం వల్ల శరీరం చురుకుగా ఉంటుంది.

కాఫీ తాగడం వల్ల దీర్ఘాయువు పెంచుకోవచ్చు. మెదడుని చురుకుగా ఉంచి మానసికంగా సంతోషంగా ఉండేలా చేస్తుంది.

Images Credit: Pexels