ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు.

ఈ విషయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మను రాహుల్ దాటేశాడు.

2023 వన్డే ప్రపంచకప్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై రాహుల్ 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

64 బంతుల్లో 11 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో కేఎల్ రాహుల్ 102 పరుగులు చేశాడు.

అంతకుముందు రోహిత్ శర్మ 63 బంతుల్లో సెంచరీ సాధించి ఈ రికార్డును తన పేర లిఖించుకున్నాడు.

ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో రోహిత్ శర్మ 131 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ 63 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు.

బెంగళూరులోని చిన్నస్వామిలో జరిగిన ఈ మ్యాచ్‌లో స్థానిక ఆటగాడు కేఎల్ రాహుల్ ఈ రికార్డు సాధించడం విశేషం.