భారత క్రికెట్ ఆటగాడు కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి వివాహం చేసుకున్నారు.

వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు.

ముంబైలో ఇద్దరూ చాలా సింపుల్‌గా కొద్ది మంది సన్నిహితుల మధ్య ఏడు అడుగులు వేశారు.

కేఎల్ రాహుల్, అతియా వివాహానికి బాగా దగ్గరి సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

కొన్ని రోజుల తర్వాత గ్రాండ్ రిసెప్షన్ ఉండనుంది.

దీనికి దాదాపు మూడు వేల మందికి పైగా హాజరయ్యే అవకాశం ఉంది.

లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా, గౌతమ్ గంభీర్, వరుణ్ ఆరోన్‌ వివాహానికి హాజరయ్యారు.

న్యూజిలాండ్ సిరీస్ కారణంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాలు వివాహానికి హాజరు కాలేదు.

వివాహం తర్వాత కేఎల్ రాహుల్, అతియా శెట్టి హనీమూన్‌కు వెళ్లే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి.

నిజానికి ప్రస్తుతం ఇద్దరి షెడ్యూల్ చాలా టైట్‌గా ఉంది.