ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన థ్రిల్లర్ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులకు పరిమితం అయింది. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న లక్నో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆడనుంది. లక్నో సూపర్ జెయింట్స్ ప్రత్యర్థి ఎవరనేది రేపు క్లారిటీ వస్తుంది. కోల్‌కతా బ్యాటర్లలో రింకూ సింగ్ (67 నాటౌట్) చివరి దాకా పోరాడాడు. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్, యష్ ఠాకూర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (58) అర్థ సెంచరీ సాధించాడు. కోల్‌కతా ఈ మ్యాచ్‌లో ఏకంగా ఎనిమిది బౌలింగ్ ఆప్షన్లను ట్రై చేసింది.