ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 146 పరుగులకు పరిమితం అయింది. దీంతో చెన్నై 77 పరుగులతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 2కి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న లక్నో రెండో స్థానానికి చేరాలంటే కోల్‌కతాను 97 పరుగులతో ఓడించాల్సి ఉంటుంది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్నర్ (86: 58 బంతుల్లో) మాత్రమే రాణించాడు. ఇంకెవరూ అతనికి సహకారం అందించలేదు. చెన్నై బ్యాటర్లలో డెవాన్ కాన్వే (87) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. రుతురాజ్ గైక్వాడ్ (79) కూడా భారీ అర్థ సెంచరీ సాధించాడు.