కిరణ్ రాథోడ్ గుర్తుందా? అదేనండి హీరో విక్రమ్‌తో ‘జెమినీ’ మూవీలో నటించిన హీరోయిన్.

ఇప్పుడు గుర్తొచ్చే ఉంటుంది. కిరణ్ రాథోడ్.. ‘నువ్వు లేక నేను లేను’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది.

ఆ వెంటనే ఆమెకు తమిళంలో ‘జెమినీ’ సినిమాలో ఛాన్స్ వచ్చింది.

ఆ తర్వాత కిరణ్ రాథోడ్ ఉదయ్ కిరణ్ నటించిన ‘శ్రీరామ్’లో ఐటెమ్ సాంగ్ చేసింది.

ఈ బొద్దుగుమ్మ తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో అవకాశాలు వరించాయి.

తమిళ చిత్రం ‘విన్నర్’ సినిమాలో అందాలను ఆరబోసి మరీ హిట్ కొట్టేసింది.

కిరణ్ దాదాపు పదేళ్లు తమిళ ఇండస్ట్రీని ఏలింది. తెలుగులో అప్పుడప్పుడు మెరిసింది.

తెలుగులో కిరణ్ చేసిన చివరి చిత్రం.. ‘కెవ్వు కేక’.

2016 నుంచి కిరణ్‌కు సినిమా అవకాశాలు దక్కలేదు.

ఆరేళ్ల తర్వాత తమిళ చిత్రం ‘సర్వర్ సుందరం’లో నటించింది. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది.

కిరణ్ తాజాగా.. నగ్నంగా కూర్చొని సిగరెట్ కాల్చుతున్న ఫొటో‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి షాకిచ్చింది.

ఆ ఫొటో చూసిన నెటిజన్స్ ‘‘ఛాన్సుల కోసం మరీ ఇంతకు తెగిస్తావా?’’ అని ట్రోల్ చేస్తున్నారు.

Images Credit: Kiran Rathod/Instagram