ధనుష్ మొదటి హాలీవుడ్ సినిమా ది గ్రేమ్యాన్ ప్రీమియర్ ముంబైలో జరిగింది. ఆ ప్రీమియర్‌కు ప్రముఖ బాలీవుడ్ నటులు కూడా వచ్చారు. ఈ ఈవెంట్‌లో బాలీవుడ్ నటి అదితి పోహాంకర్ ఇలా అందాలతో కనువిందు చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో ‘SHE’ సిరీస్ తనకు మంచి పేరు తెచ్చింది. దీనికి సంబంధించిన రెండో సీజన్ కూడా ఇటీవలే విడుదలై పెద్ద సక్సెస్ అయింది. ఈ ప్రీమియర్‌లో విక్కీ కౌశల్ కూడా పాల్గొన్నాడు. అదితి, విక్కీ కాసేపు ముచ్చటించుకున్నారు కూడా. విక్కీ కౌశల్ ఈ మధ్యే కత్రినా కైఫ్‌ను పెళ్లాడిన సంగత తెలిసిందే. ఈ ఈవెంట్‌లో వీరితో పాటు మరికొందరు బాలీవుడ్ నటులు కూడా పాల్గొన్నారు. అవెంజర్స్ చిత్రాలను రూపొందించిన రుస్సో బ్రదర్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.