‘కళావతి’ గ్యాంగ్‌తో కీర్తి సురేష్, స్పెయిన్‌లో సందడి అందం, అభినయం కలగలిస్తే.. కీర్తి సురేష్. దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. ‘సర్కారువారి పాట’ మూవీలో తన గ్లామర్‌తో కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టేసుకుంది ఈ భామ. ఆ సినిమాలోని ‘‘కళావతి..’’ సాంగ్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో తెలిసిందే. తాజాగా కీర్తి ఆ రోజులను గుర్తుచేసుకుంటూ తాజాగా స్పెయిన్ ఫొటోలు పెట్టింది. మిస్సింగ్ కళావతి గ్యాంగ్.. అంటూ అప్పట్లో తీసుకున్న పిక్స్, వీడియోలు ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కీర్తి సురేష్ నటించిన ‘దసరా’ మూవీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఆ తర్వాత చిరంజీవితో నటిస్తున్న ‘భోళాశంకర్’ కూడా విడుదల కానుంది. Images Credit: Keerthy Suresh/Instagram