BRS అధినేత కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు 115 మందితో తొలి జాబితా విడుదల చేశారు.

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఏడుగురికి మాత్రమే టిక్కెట్లు నిరాకరించారు. ఆ వివరాలిలా..

పౌరసత్వ సమస్యతో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు టికెట్ ఇవ్వలేదు

2 సార్లు గెలిచిన ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ కు ఈసారి మొండి చేయి

BRSలో చేరిన ఎమ్మెల్యే ఆత్రం సక్కును కాదని కోవా లక్ష్మీకి ఆసిఫాబాద్ టికెట్

బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు మొండిచేయి

స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్యే రాజయ్యను కాదని కడియం శ్రీహరికి టికెట్

వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ను కాదని మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్‌కు ఛాన్స్

ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డికి నిరాకరించి, పార్టీలో చేరిన బండారి లక్ష్మారెడ్డికి టిక్కెట్