కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించిన ‘టైగర్ 3’ ఆదివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కత్రినా మూడో సారి ఐఎస్ఐ ఏజెంట్ జోయా పాత్రలో కనిపించనున్నారు. ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ సినిమాల్లో కత్రినా ఈ పాత్రలో నటించారు. ఒకే పాత్రను కత్రినా మూడు సార్లు పోషించడం ఇదే మొదటిసారి. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇదే యూనివర్స్‌లో దీపికా పదుకొనే కూడా పాకిస్తానీ ఏజెంట్‌గా కనిపించారు. వీరిద్దరూ త్వరలో ఒకే సినిమాలో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. ఒక ఫిమేల్ ఓరియంటెడ్ స్పై మూవీని వీరితో ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ‘టైగర్ వర్సెస్ పఠాన్’లో కత్రినా ఉంటుందో లేదో తెలియరాలేదు.