బాలీవుడ్‌లో సారా అలీ ఖాన్ దీపావళి పార్టీ ఇచ్చారు. దీనికి ఆదిత్య రాయ్ కపూర్ కూడా వచ్చారు. 2009లో ఆదిత్య రాయ్ కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ‘ఆషికి 2’ సినిమాతో తనకు మంచి బ్రేక్ వచ్చింది. ‘ఓకే జాను’, ‘మలంగ్’ లాంటి సినిమాలతో హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించాడు. ఈ సంవత్సరం ‘గుమ్రా’తో ప్రేక్షకులను పలకరించాడు. తమిళ సినిమా ‘తడం’కి ఇది రీమేక్. ‘తడం’ తెలుగులో కూడా ‘రెడ్’ పేరుతో రీమేక్ అయింది. ‘నైట్ మేనేజర్’ సిరీస్‌తో ఓటీటీ స్పేస్‌లోకి కూడా ఎంటర్ అయ్యారు. ఇది కూడా మంచి సక్సెస్ అయింది.