కార్తీకమాసంలో ఉపవాసం 6 రకాలు - మీరేం పాటిస్తున్నారు!



కార్తీకంలో వచ్చే ఏ సోమవారం అయినా సరే - స్నాన, జపాదులను ఆచరించిన వారు వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారని శాస్త్రవచనం



ఈ సోమవార వ్రతవిధి 6 రకాలు... 1.ఉపవాసము 2.ఏకభక్తము 3.నక్తము 4.అయాచితము 5.స్నానము 6.తిలదానము



శక్తిగలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా అభోజనము (ఉపవాసం)తో గడిపి...సూర్యాస్తమయం కాగానే శివుడిని అభిషేకించి, పూజించి..నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థం మాత్రమే సేవిస్తారు



రోజంతా కఠిన ఉపవాసం చేయలేనివారు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసికుని - మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రి భోజనానికి బదులు తులసీ తీర్ధమో మాత్రమే తీసుకుంటారు



పగలంతా ఉపవాసం ఉండి..రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమునం కానీ, ఉపాహారం కాని స్వీకరిస్తారు



రోజంతా ఉపవాసం ఉండి..తమ భోజనాన్ని తాము వండుకోకుండా..ఎవరైనా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయాచితము అంటారు



ఉపవాసాలు, నక్తం, ఏకభుక్తం, అయాచితం ఇవి ఏవీ చేయలేనివారు సమంత్రక స్నాన జపాదులు చేస్తారు



మంత్ర జపవిధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం రోజు నువ్వులు దానం చేసినా మంచిదని సూచిస్తున్నారు పండితులు...



పై ఆరు పద్ధతులలో దేవిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. ఈ వ్రతాచరణము వలన విష్ణు సాయుజ్యం పొందుతారని కార్తీక పురాణంలో ఉంది.



కార్తీకమాసములో వచ్చే ప్రతి సోమవారం పగలు ఉపవసించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనము చేసి రోజంతా భగవద్ధ్యానంలో గడిపే వాళ్లు తప్పనిసరిగా శివసాయుజ్యాన్ని పొందుతారు.



Image Credit: Pinterest