కార్తీ తన తర్వాతి సినిమా సర్దార్‌లో చాలా గెటప్స్‌లో కనిపించనున్నారు. అభిమాన్యుడు డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ‘సర్దార్’ను కూడా తెరకెక్కించారు. ఇందులో కార్తీ గూఢచారిగా నటించనున్నారు. రజీషా విజయన్, రాశి ఖన్నాలు కార్తీకి జోడిగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన ఈ సినిమా విడుదల చేయనున్నారని సమాచారం. ప్రిన్స్ పిక్చర్ పతాకంపై ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగులో అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ ద్వారా సర్దార్ రిలీజ్ అవుతుంది. పీఎస్ మిత్రన్ గతంలో అభిమన్యుడు, హీరో (తెలుగులో శక్తి) చిత్రాలను తెరకెక్కించారు. బ్లాక్‌బస్టర్ పొన్నియిన్ సెల్వన్ 1 తర్వాత విడుదల అవుతున్న కార్తీ సినిమా ఇదే.