విక్రమ్, శ్రీనిధి శెట్టి జంటగా, క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్రలో నటించిన సినిమా 'కోబ్రా'. తెలుగు, తమిళ భాషల్లో వినాయక చవితి రోజైన ఆగస్టు 31న 'కోబ్రా' విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే... 'కోబ్రా' కథేంటి? : స్కాట్లాండ్ యువరాజు హత్యకు గురవుతారు. ఆ హత్యకు, ఒరిస్సా సీయం హత్యకు లెక్కలు కారణమని ఓ అమ్మాయి చెబుతుంది. మన దేశంలో సాధారణ లెక్కల మాస్టారు మది (విక్రమ్)ను ఇంటర్‌పోల్ ఆఫీసర్ అస్లాం (ఇర్ఫాన్ పఠాన్) అనుమానిస్తారు. దేశ, విదేశాల్లో హత్యలకు... లెక్కల మాస్టారుకు సంబంధం ఏమిటి? అనుమానం నిజమా? కదా? అనేది సినిమా సినిమా ఎలా ఉంది? : విక్రమ్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. నటనలో కొత్తదనం, వైవిధ్యం చూపించారు. విక్రమ్ వేసిన గెటప్‌ల కంటే ఆయన సాధారణంగా కనిపించిన సీన్స్‌లో యాక్టింగ్ బావుంది. విక్రమ్ స్క్రీన్ మీద హీరో అయితే స్క్రీన్ వెనుక రెహమాన్ హీరో. ఆయన పాటలు, నేపథ్య సంగీతం సూపర్బ్. విక్రమ్, రెహమాన్ బెస్ట్ ఇచ్చారు. అయితే... దర్శకుడు బెస్ట్ ఇవ్వలేదు. స్క్రీన్ ప్లే బావుంది కానీ లాజిక్స్ మిస్ అయ్యారు. స్టార్టింగ్ టు క్లైమాక్స్ ఓ స్టైల్‌లో సినిమాను ముందుకు నడిపించిన దర్శకుడు... క్లైమాక్స్‌లో రొటీన్‌గా వెళ్లారు. అది మేజర్ మైనస్. శ్రీనిధి శెట్టి బావున్నారు. నటన కూడా బావుంది. అయితే... హీరోను ఎందుకు అంత ప్రేమిస్తుంది? అనేది క్లారిటీ లేదు. 'కోబ్రా'లో కొన్ని డల్ మూమెంట్స్ ఉన్నాయి. కొన్నిసార్లు వాటిని మర్చిపోయేలా విక్రమ్, రెహమాన్ మాయ చేశారు. విక్రమ్ కోసం, రెహమాన్ కోసం ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. 'కోబ్రా' కంప్లీట్ రివ్యూ, రేటింగ్ కోసం ABP Desam వెబ్ సైట్ చూడండి.