ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆదిపురుష్ టీజర్ ఆదివారం లాంచ్ అయింది. అయోధ్యలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ టీజర్‌ను విడుదల చేశారు. దీంతోపాటు సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓమ్ రౌత్ పాల్గొన్నారు. ఆదిపురుష్‌లో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ సినిమా టీజర్‌ను బట్టి యానిమేషన్, లైవ్ యాక్షన్ కాంబినేషన్‌లో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి టీజర్‌కు మిశ్రమ స్పందన లభిస్తుంది. సినిమా ఇలానే ఉంటుందా? గ్రాఫిక్స్ విషయంలో మరింత వర్క్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.