దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న సినిమా 'సీతారామం'. 'అందాల రాక్షసి', 'పడి పడి లేచె మనసు' వంటి సినిమాలను డైరెక్ట్ చేసిన హను రాఘవపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక కీలకపాత్రలో నటిస్తోన్న ఈ సినిమాను ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. తాజాగా ఈ సినిమాలో థర్డ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'కానున్న కళ్యాణం' పాటని హైదరాబాద్ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో జరిగిన ఈవెంట్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, తరుణ్ భాస్కర్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ పాటకు వేదికపై దుల్కర్ సల్మాన్. మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ చేయడం ప్రేక్షకులని అలరించింది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ పాట మనసుని హత్తుకుంది. అనురాగ్ కులకర్ణి, సిందూరి ఈ పాటని ఆలపించిన విధానం అద్భుతంగా వుంది.