ABP Desam
Image Source: Social Media and ‘The Legend’ Movie

తమిళనాడులో శరవణన్ స్టోర్స్ యజమానిగా కోట్లు గడిస్తున్నారు శరవణన్ అరుల్.

ABP Desam

‘ది లెజెండ్ శరవణన్’ సినిమాతో ఆయన పాన్ ఇండియా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

ABP Desam

ఆయనకు సినిమాల్లో నటించాలనే కోరిక బాల్యం నుంచే ఉన్నా బిజినెస్ బాధ్యతల వల్ల కుదరలేదు.

అందుకే, ఆయన 51 ఏళ్ల వయస్సులో లేటుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది.

శరవణన్ ఇదివరకే హన్సిక, తమన్నాలతో తమ స్టోర్ యాడ్‌లో నటించి ఆశ్చర్యపరిచారు.

హీరో అంటే అందం అవసరం లేదని, ఆత్మవిశ్వాసం ఉంటే చాలంటూ బరిలోకి దిగారు.

శరవణన్ తండ్రి సెల్వా రదినం చెన్నైలో ఛాయ్‌వాలాగా బిజినెస్ మొదలుపెట్టారు.

అలా అలా ఆయన పెద్ద బిజినెస్ మ్యాన్‌గా ఎదిగి శరవణన్ స్టోర్స్ ప్రొప్రైటర్ అయ్యారు.

ఆ తర్వాత సెల్వా తన తమ్ముళ్లను పార్టనర్లుగా చేర్చుకుని బిజినెస్ విస్తరించారు.

కానీ, శరవణన్ వారి నుంచి విడిపోయి ‘ది లెజెండ్ శరవణన్’ తదితర బ్రాంచ్‌లు ప్రారంభించారు.

‘లెజెండ్’ శరవణన్ ఇప్పుడు రూ.240 కోట్లకు అధిపతి, మరి ఆయన తలచుకుంటే హీరో కాలేడా?

Images Credit: Social Media and ‘The Legend’ Movie