రీతూ చౌదరి, ‘జబర్దస్త్’ ప్రేక్షకులకు ఈమె గురించి పరిచయం అక్కర్లేదు. ఇన్నోసెంట్ ఫేస్‌తో హైపర్ ఆది వేసే పంచ్‌లను భరిస్తూ రీతూ పాపులర్ అయ్యింది. వాస్తవానికి రీతూ సీరియల్ నటి. ఆది దయవల్ల ‘జబర్దస్త్’ షోలో సెటిలైంది. రీతూ అప్పుడప్పుడు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’లో కనిపిస్తుంది. మొత్తానికి రీతూ పాపులారిటీతోపాటు బాయ్ ఫ్రెండ్‌ను కూడా సంపాదించింది. ‘ఫెవికల్’ యాడ్ తరహాలో రీతూ.. తన బాయ్ ఫ్రెండ్‌ను అస్సలు వదలడం లేదు. ఈ మధ్య ఆమె ఇన్‌స్టాలో చేస్తున్న పోస్టుల్లో ఎక్కువగా అతడే కనిపిస్తున్నాడు. రీతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసింది. తాజాగా చీర మాయమై.. జీన్స్, టాప్‌లోకి మారిపోయే వీడియో పోస్ట్ చేసింది. Images Credit: Rithu Chowdary/Instagram