బాలీవుడ్ భామ కంగనా రనౌత్ ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత?

చండీగఢ్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ సీటుకు కంగనా రనౌత్ పోటీ చేస్తారని టాక్. 

ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని కంగన దర్శించుకున్నారు. ఎంపీ ఎన్నికలకు రెడీ అవుతున్నట్లు చెప్పారు. 

ఎన్నికల్లో పోటీకి కంగనా రెడీ అని చెప్పడంతో... చండీగఢ్ నియోజకవర్గం నుంచి బరిలో నిలబడతారని ప్రచారం మొదలైంది.

చండీగఢ్ నుంచి కంగనా రనౌత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు పోస్టర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

సదరు ప్రచారాన్ని కంగనా రనౌత్ ఖండించారు. తనకు బీజేపీ టికెట్ వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు.

చండీగఢ్ టికెట్ కంగనాకు రాలేదనేది నిజం. అయితే... ఆమె ఎక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

త్వరలో 'ఎమర్జెన్సీ' సినిమాతో కంగనా రనౌత్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Image Source: all images courtesy : kangana ranaut

'చంద్రముఖి 2'తో ఆమె ఖాతాలో ఫ్లాప్ చేరింది. గతంలో చేసిన సౌత్ సినిమా 'తలైవి' కూడా పెద్ద హిట్ కాదు.