అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్టలో కంగనా ‘జై శ్రీరామ్’ నినాదాలతో కేరింతలు కొట్టారు. కంగనా రనౌత్ త్వరలో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ తరఫున ఆమె ఎంపీగా పని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గత రెండు సంవత్సరాలు కంగనాకు ఏమాత్రం కలిసిరాలేదు. 2022లో వచ్చిన ‘ధాకడ్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయంగా నిలిచింది. రూ.80 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘ధాకడ్’ కనీసం రూ.రెండు కోట్ల వసూళ్లు కూడా సాధించలేకపోయింది. 2023లో మూడు సినిమాల్లో కంగనా కనిపించారు. తనే నిర్మాతగా తెరకెక్కిన ‘టికు వెడ్స్ షేరు’ మొదటగా విడుదల అయింది. ఆ తర్వాత వచ్చిన ‘చంద్రముఖి 2’, ‘తేజాస్’ కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేశాయి. ప్రస్తుతం తన చేతిలో ‘ఎమర్జెన్సీ’ సినిమా ఉంది.