షారుక్ ఖాన్ నటించిన ‘కల్ హో నా హో’ మరికొద్ది రోజుల్లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది.

షారుక్ కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి.

ఈ సినిమా గురించి దర్శకుడు నిఖిల్ అద్వానీ ఇంట్రస్టింగ్ విషయాలు షేర్ చేశారు.

నాలుగు రోజులు షూటింగ్ చేశాక షారుక్ గాయం బారిన పడ్డారట.

ఈ సందర్భంగా తాను సినిమా నుంచి తప్పుకుంటానని ఆయన కోరారట.

కానీ నిఖిల్, నిర్మాతలు మాత్రం షారుక్ ఖాన్ కోసం వెయిట్ చేశారని దర్శకుడు తెలిపారు.

ఆరు నెలలు దాటినా సరే షారుక్ వచ్చాకనే షూటింగ్ చేశామన్నారు.

2003 నవంబర్‌లో ఈ సినిమా విడుదల అయింది.

అప్పట్లోనే రూ.86 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసింది.

ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ ఎహసాన్ లాయ్‌లకు ఈ సినిమాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది.