భర్తతో కాజల్ లిప్ లాక్, ఫొటో వైరల్ కాజల్ ఈ ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రెగ్నెన్సీ వల్ల కాజల్ కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ప్రస్తుతం కాజల్ మళ్లీ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది. డెలివరీ తర్వాత ఆమె నటించిన తమిళ మూవీ ‘ఘోస్ట్లీ’ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. కమల్ హాసన్‌తో ‘ఇండియన్-2’ మూవీలో కూడా కాజల్ నటిస్తోంది. ‘ఇండియన్-2’ కోసం కాజల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది. క్రిస్మస్ సందర్భంగా కాజల్ తన భర్తను ప్రేమగా ముద్దాడుతున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. భర్త గౌతమ్ కిచులు కొడుకును ఎత్తుకోగా.. కాజల్ అతడికి ప్రేమతో లిప్ లాక్ ఇవ్వడానికి ఈ ఫొటోలో చూడవచ్చు. Images Credit: Kajal A Kitchlu/Instagram