మలయాళ భామ హనీ రోజ్ ‘వీర సింహా రెడ్డి’తో టాలీవుడ్‌లో రీ-ఎంట్రీ ఇస్తున్నారు. 2005 నుంచే మలయాళంలో హనీ రోజ్ సినిమాలు చేస్తున్నారు. 2008లో తెలుగులో ‘ఆలయం’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత 2013లో ‘ఈ వర్షం సాక్షిగా’ సినిమాలో కనిపించింది. ఇప్పుడు సరిగ్గా 10 సంవత్సరాల తర్వాత ‘వీరసింహా రెడ్డి’తో పలకరించనుంది. ఇటీవలే మోహన్ లాల్ సినిమా ‘మాన్‌స్టర్’లో కనిపించింది. ఇందులో మంచు లక్ష్మి సరసన లెస్బియన్ పాత్రలో కనిపించింది. మలయాళంలో హనీ రోజ్ దాదాపు స్టార్ హీరోయిన్.