‘బాస్ పార్టీ’ సాంగ్‌కు సిరి, రవి అదిరేటి డ్యాన్స్!

యాంకర్ రవి, సిరి మంచి ఫ్రెండ్స్.

వీరిద్దరూ ‘బిగ్ బాస్’ సీజన్-5లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఇద్దరు కలిసి ‘బాస్ పార్టీ’ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు.

ఆ డ్యాన్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సిరి తన గ్లామర్ లుక్‌లో అదరగొడితే, రవి ఊరమాస్ లుక్‌లో ఆకట్టుకున్నాడు.

‘జీ తెలుగు’లో ప్రసారమయ్యే ‘క్రిస్మస్ పార్టీ’ కార్యక్రమం కోసం వీరిద్దరు కలిశారు.

అన్నట్టు సిరి ఇప్పుడు మాంచి జోష్‌లో ఉంది.

ఆమె ప్రియుడు శ్రీహాన్ BB6 రన్నరప్ కావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు.

Images & Videos Credit: Siri and Ravi/Instagram