రాశీ ఖన్నా పెద్ద మనసు - వారి కళ్లల్లో ఆనందం కోసం అలా.. నటి రాశీఖన్నా నవ్వే కాదు.. ఆమె మనసు కూడా ఎంతో స్వచ్ఛమైనది. క్రిస్మస్ నేపథ్యంలో ఆమె సికింద్రబాద్‌లోని స్వయంకృషి ఆశ్రమానికి వెళ్లింది. ఒక రోజును మానసిక, శారీరక వికలాంగులతో గడిపింది. ఈ సందర్భంగా ఆ ఆశ్రమాన్ని నడుపుతున్న మంజులా కల్యాణ్‌ను కలిసింది. అక్కడ వారికి ఏయే శిక్షణలు ఇస్తున్నారో తెలుసుకుంది రాశీ. అనంతరం రాశీఖన్నా అక్కడే క్రిస్మస్ వేడుకలను నిర్వహించింది. వారు తయారు చేసిన వివిధ వస్తువులను చూసి ఆశ్చర్యపోయింది. అలాంటివారి కోసం మనం చిన్న సాయం చేసినా పెద్దదేనని రాశీఖన్నా పేర్కొంది. ఈ వీడియో చూసిన రాశీఖన్నా అభిమానులు.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. Images and Video Credit: Raashii Khanna/Instagram