సదా, మీ సేవలో - ఆ పువ్వుల మాట, అదేనేమో! అందాల సదా.. ‘‘వెళ్లవయ్యా’’ అంటున్నా, రమ్మని పిలిచినట్టే ఉంటుంది. ‘‘వెళ్లవయ్య వెళ్లూ..’’ అని సదా చెప్పే డైలాగ్‌లో క్యూట్‌నెస్ అలాంటిది. ప్రస్తుతం సదాకు సినిమా అవకాశాలు లేకపోయినా.. బుల్లితెరపై మాత్రం బిజీగా ఉంటుంది. తాజాగా ‘బీబీ జోడీ’లో జడ్జిగా ఛాన్స్ కొట్టేసింది. అలనాటి అందాల బొమ్మ, సీనియర్ నటి రాధతో కలిసి ‘బీబీ జోడీ’లో సందడి చేస్తోంది. ‘బీబీ జోడీ’ తాజా ఎపిసోడ్ కోసం సదా పువ్వుల డ్రెస్‌లో కనిపించింది. దీంతో ఆ అభిమానుల ఆ పూలకే అందాన్ని తెచ్చావు సదా అంటున్నారు. ఆ పువ్వులు ‘సదా మీ సేవ’లో అంటూ ఆమెపై వాలినట్లుగా ఉన్నాయంటున్నారు. మరి మీరేమంటారు? Images and Videos Credit: Sadaa/Instagram