రీల్ జోడీ, రియల్ కపుల్ రణ్‌వీర్, దీపికా పదుకొనే ముంబై తీరం నుంచి అలీబాగ్ బీచ్‌కు వెళ్లారు. ఇటీవలే ఈ జంట అలీబాగ్‌లో ఖరీదైన లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. చూస్తుంటే, వీరిద్దరూ అక్కడే తమ ఇయర్ ఎండ్‌ను ఎంజాయ్ చేయడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. బోటులో కూర్చున్న రణ్‌వీర్ బ్లాక్ టీషర్ట్, డెనిమ్ ఫ్యాంట్‌లో ఉన్నాడు. దీపిక.. ఫుల్ వైట్ కలర్ డ్రెస్‌లో నిండుగా కనిపించింది. ఇద్దరూ సన్ గ్లాసెస్ పెట్టుకుని చాలా కూల్‌గా కనిపించారు. ఇద్దరూ వైట్ కలర్ మ్యాచింగ్ షూస్ ధరించారు. 2022 సంవత్సరం దీపికా, రణ్‌వీర్‌లకు బిజీగానే గడిచింది. అయితే, సరైన సక్సెస్ లేదు. దీపికా ఇటీవలే FIFA వరల్డ్ కప్ ట్రోపీని ఆవిష్కరించి వార్తల్లోకెక్కింది. మరి, 2023 ఈ జంటకు 2023 మళ్లీ సక్సెస్‌ను తిరిగి తీసుకొస్తుందో లేదో చూడాలి.