జపాన్‌లో తారక్, చెర్రీ ఫ్యామిలీ సందడి, ‘RRR’ అక్కడా అదుర్స్! రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన RRR మూవీ జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రత్యేకంగా ఈ మూవీని ఆ భాషలోకి డబ్బింగ్ చేసి మరీ విడుదల చేశారు. అంతేకాదు, ప్రమోషన్స్ కోసం అంతా తమ ఫ్యామిలీలతో జపాన్ చెక్కేశారు. జపాన్ మీడియాతో బిజీగా ఉంటూనే.. మరోవైపు అక్కడి ప్రజలతో కలిసిపోయారు. తారక్, చెర్రీలు టోక్యో వీధుల్లో సందడి చేశారు. అభిమానులతో మమేకమయ్యారు. ఈ వీడియోలను చూసి ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఇండియాలో పాన్ ఇండియా మూవీగా విడుదలైన RRRకు ఎంత క్రేజ్ వచ్చిందో తెలిసిందే. RRR సినిమాకు హాలీవుడ్ తారలు, టెక్నీషియన్స్ కూడా ఫిదా అయ్యారు. ఈ మూవీ రూపొందించిన రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి, జపాన్‌లో ఈ మూవీ ఏ స్థాయిలో హిట్ కొడుతుందో చూడాలి. Images Credit: RRR, Upasana, NTR, Ram Charan/Instagram