శివకార్తికేయన్ హీరోగా 'జాతి రత్నాలు' దర్శకుడు అనుదీప్ తీసిన సినిమా 'ప్రిన్స్'. ఇది ఎలా ఉందంటే?

కథేంటి? : ఆనంద్ (శివ కార్తికేయన్) స్కూల్ టీచర్. అయితే, రెగ్యులర్‌గా వెళ్ళడు. వాళ్ళ స్కూల్‌లోకి కొత్త లేడీ టీచర్ వస్తుంది.

బ్రిటిష్ భామ జెస్సికా (మారియా) కోసం రెగ్యులర్‌గా స్కూల్‌కు వెళ్లడం స్టార్ట్ చేస్తాడు ఆనంద్. ఇద్దరూ ప్రేమలో పడతారు.

ఆనంద్ ప్రేమ పెళ్ళికి అతడి తండ్రి విశ్వనాథం (సత్యరాజ్) నో చెబుతాడు. ఊరి ప్రజలూ వ్యతిరేకిస్తారు. 

తండ్రితో పాటు జెస్సికా తల్లిదండ్రులను ఆనంద్ ఎలా ఒప్పించాడు? ఎలా పెళ్లి చేసుకున్నాడు? అనేది సినిమా

'జాతి రత్నాలు' తరహా వినోదం అందించాలని శివకార్తికేయన్, అనుదీప్ చేసిన ప్రయత్నమే 'ప్రిన్స్'.

'జాతి రత్నాలు' టైపులో కామెడీ వర్కవుట్ కాలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్, పోలీస్ సెషన్ సీన్, క్లైమాక్స్ బావున్నాయి.

శివకార్తికేయన్ మ్యాగ్జిమమ్ ట్రై చేశారు కానీ... అనుదీప్ రైటింగ్‌లో పంచ్, కామెడీ మిస్ అయ్యాయి. 

తమన్ పాటల్లో రెండు, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బావున్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ ఓకే.

కామెడీ కోసం 'ప్రిన్స్'కు వెళ్లాలనుకుంటే ఆలోచించాలి. 'జాతి రత్నాలు' మేజిక్ వర్కవుట్ కాలేదు. 

తమిళం సంగతి పక్కన పెడితే... తెలుగులో ఈ సినిమా హిట్ కావడం కష్టమే.