డబ్ స్మాష్ వీడియోలతో క్యూట్ బ్యూటీ దీప్తి సునయన బాగా పాపులర్ అయ్యింది. డబ్ స్మాష్ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టి, చక్కటి ఆటతీరుతో ఆకట్టుకుంది. ఆ తర్వాత యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ తో దీప్తి ప్రేమాయణం నడిపింది. షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లడం, సిరి హన్మంతులో క్లోజ్ గా మూవ్ కావడం దీప్తికి అస్సలు నచ్చలేదు. శణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పి దీప్తి కొద్ది రోజుల పాటు డిప్రెషన్ లోకి వెళ్లింది. ప్రస్తుతం దీప్తి యూట్యూబ్ ఆల్బమ్స్ చేస్తూ బిజీగా గడిపేస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ, ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తుంది. తాజాగా దీప్తి పోస్ట్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. Photos, Video credit: Deepthi Sunaina/Instagram