దీపావళి సందర్భంగా తెలుగునాట థియేటర్లలో ఒక్కరోజు నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. విష్ణు మంచు, సన్నీ లియోన్, పాయల్ నటించిన 'జిన్నా' విడుదల అక్టోబర్ 21న! విశ్వక్ సేన్ హీరోగా, వెంకటేష్ అతిథి పాత్రలో నటించిన 'ఓరి దేవుడా' విడుదల కూడా 21నే శివ కార్తికేయన్ హీరోగా 'జాతి రత్నాలు' దర్శకుడు కేవీ అనుదీప్ తెరకెక్కించిన తెలుగు, తమిళ సినిమా 'ప్రిన్స్' విడుదల కూడా 21నే కార్తీ హీరోగా పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన 'సర్దార్' సైతం 21న విడుదల అవుతోంది. జిన్నా, ప్రిన్స్, సర్దార్, ఓరి దేవుడా కంటే ఒక్క రోజు ముందు హాలీవుడ్ సినిమా 'బ్లాక్ ఆడమ్' 20న రిలీజ్ అవుతోంది. పాయల్‌కు డబుల్ ధమాకా. ఆమె నాయికగా నటించిన కన్నడ సినిమా 'హెడ్ బుష్' కూడా 21న విడుదలవుతోంది. వచ్చే మంగళవారం దీపావళి సందర్భంగా అక్టోబర్ 25న 'రామ్ సేతు' విడుదల అవుతోంది. అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన 'థాంక్ గాడ్' విడుదల కూడా 25న!