జపాన్‌కు ఎన్టీఆర్, చరణ్ ఫ్యామిలీస్, ఇవిగో వీడియోలు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో రామ్ చరణ్, ఎన్టీఆర్‌లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను ప్రపంచ భాషల్లో విడుదలకు రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 21న ఈ సినిమాను జపాన్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ జపాన్ చేరుకుంది. రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో, ఎన్టీఆర్.. ప్రణతి, కొడుకులతో జపాన్ వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి, జపాన్‌లో కూడా RRR తన సత్తా చాటుతుందో లేదో చూడాలి. Images and Videos Credit: Instagram