రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా హీరోయిన్లుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అక్కా చెల్లెళ్ళు కాబట్టి శివాని, శివాత్మిక క్లోజ్ గా ఉంటారు. వాళ్ళు కలిసి ఫోటోలు దిగడంలో ఎలాంటి సందేహం లేదు. శివాని, శివాత్మిక ఇండస్ట్రీలో పెరిగారు కాబట్టి చాలా మంది ప్రముఖుల పిల్లలతో స్నేహం ఉంది. ఇండస్ట్రీలో జనాలు కాకుండా శివాని, శివాత్మిక... ఇద్దరికీ క్లోజ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా? హీరోయిన్ ఈషా రెబ్బా! అవును... శివాని, శివాత్మిక, ఈషా రెబ్బా క్లోజ్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడూ కలిసి జిమ్ చేస్తారు. హ్యాంగవుట్ అవుతారు. విజయభాస్కర్ దర్శకత్వంలో శివాని 'జిలేబీ' సినిమా చేస్తున్నారు. ఇటీవల పూజతో ప్రారంభమైంది. 'జిలేబీ' ప్రారంభోత్సవం రోజున శివాని, శివాత్మిక, ఈషా కలిసి సందడి చేశారు. 'జిలేబీ' కాకుండా 'విద్యా వాసుల అహం' సినిమా, 'అహనా పెళ్ళంట' వెబ్ సిరీస్ చేస్తున్నారు శివాని.