అలా ఉండే కీర్తి సురేష్, ఇలా మారిపోయింది కీర్తి సురేష్, ఇప్పుడు దక్షిణాదిలో నెంబర్ వన్ హీరోయిన్. తెలుగుతోపాటు మలయాళం, తమిళ చిత్రాల్లోనూ డిమాండ్ ఉన్న నటి. కీర్తి సురేష్ తండ్రి జి.సురేష్ కుమార్ మలయాళి నిర్మాత. కీర్తి సురేష్ తల్లి మేనక 1980లో ‘పున్నమినాగు’ సినిమాలో చిరంజీవి సరసన నటించారు. కీర్తి 2000 సంవత్సరంలో ‘పైలట్స్’ మూవీతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘గీతాంజలి’ మూవీతో హీరోయిన్‌గా కెరీర్ మొదలుపెట్టింది. తెలుగులో ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత కీర్తి సురేష్ మూవీ జర్నీ గురించి మీకు తెలిసిందే. అయితే, ఒకప్పుడు బొద్దుగా కనిపించిన కీర్తి సురేష్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు సన్నగా, నాజూగ్గా.. విభిన్న పాత్రలతో కీర్తి ‘మహానటి’ అనిపించుకుంటోంది. 2023లో కీర్తి సురేష్ సుమారు నాలుగు తెలుగు, తమిళ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తి సురేష్ 1992 అక్టోబరు 17న చెన్నైలో జన్మించింది. Images and Videos Credit: Keerthy Suresh/Instagram