‘జిన్నా’ షూటింగ్ వీడియోస్, పాయల్ సందడి మామూలుగా లేదు! మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ విడుదలకు సిద్ధమవుతున్నా సంగతి తెలిసిందే. అక్టోబరు 21న ‘జిన్నా’ థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో మంచు విష్ణు సరసన పాయల్, సన్ని లియోన్ నటిస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లోని వీడియోలను పోస్ట్ చేసింది. ‘జిన్నా’ సినిమా షూటింగ్‌లో పాయల్ హడావిడి మామూలుగా లేదు. షూటింగ్స్‌లో పాయల్ ఎంత యాక్టీవ్‌గా ఉంటుందో ఈ వీడియోల్లో చూడవచ్చు. మంచు విష్ణు, పాయల్ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరూ ‘జిన్నా’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నారు. మరి, ఈ సినిమా హిట్టా.. ఫట్టా అనేది కొద్దిరోజుల్లోనే తేలిపోనుంది. Images and Videos Credit: Manchu Vishnu & Payal Rajput