హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్ళికి రెడీ అవుతున్నారా? అంటే... బాలీవుడ్ 'అవును' అంటోంది. బాలీవుడ్ యంగ్ హీరో, ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్నట్లు గత ఏడాది అక్టోబర్ 21న రకుల్ అనౌన్స్ చేశారు. జాకీ భగ్నానీ, రకుల్ వచ్చే ఏడాది వివాహ బంధంలో అడుగు పెట్టనున్నట్లు వాళ్ళ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ''వాళ్ళిద్దరూ 2023లో వైఫ్ అండ్ హజ్బెండ్ అవుతారు'' అని రకుల్, జాకీ ఫ్రెండ్స్ చెప్పే మాట. ప్రస్తుతానికి పెళ్లి ముహూర్తం గానీ, ఏ నెలలో పెళ్ళి చేసుకోవాలనేది గానీ ఇంకా నిర్ణయించలేదట. జాకీ నిర్మించిన కొన్ని సినిమాల్లో రకుల్ నటించారు. అప్పుడు ప్రేమలో పడ్డారు. రకుల్ తమ్ముడు అమన్ కూడా తన అక్క, జాకీ తప్పకుండా పెళ్లి చేసుకుంటారని చెప్పారు. పెళ్లి తర్వాత రకుల్ సినిమాల్లో నటిస్తారని, అందుకు అత్తారింటి నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని ముంబై టాక్.