మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన ‘బిగ్ బాస్’ బ్యూటీ నందిని రాయ్ ‘బిగ్ బాస్’ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైన నటి నందిని రాయ్. నందిని రాయ్ అసలు పేరు నీలం గౌహ్రాణి. తెలుగులో ‘040, హార్మోన్స్, మాయా’ సినిమాలు చేసినా నందినికి గుర్తింపురాలేదు. ‘మోసగాళ్లకు మోసగాళ్లు’ సినిమాతో సుధీర్ బాబు పక్కన ఛాన్స్ కొట్టేసింది. కానీ, ఆ సినిమా కూడా నందినికి లక్ తీసుకురాలేదు. ఆ తర్వాత ‘సిల్లీ ఫెలోస్’ మూవీలో నటించింది. 2018లో ‘బిగ్‌బాస్-2’లో ప్రత్యక్షమైంది. ‘బిగ్ బాస్’ నుంచి బయటకు వచ్చాక పలు తెలుగు వెబ్ సీరిస్‌ల్లో నటించింది. తాజాగా నందిని రాయ్ తిరుమలలో ప్రత్యక్షమైంది. మొకాళ్లపై తిరుమల మెట్లు ఎక్కుతున్న వీడియోను నందిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. Images and Videos Credit: Nandini Rai/Instagram