సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జ్యోతిక టాప్ హీరోయిన్‌గా కొనసాగారు. ‘చంద్రముఖి‘ లాంటి సినిమాతో చక్కటి గుర్తింపు పొందారు. తెలుగులో ‘ఠాగూర్‘ సహా పలు సినిమాల్లో నటించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాలలో నటించి మెప్పించారు. జ్యోతిక 1978 అక్టోబర్ 18న ముంబైలో జన్మించారు. 2006లో తమిళ హీరో సూర్యను పెళ్లి చేసుకున్నారు. జ్యోతిక, సూర్య దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు. కుమార్తె డియా, కుమారుడు దేవ్. 44 ఏండ్ల వయసున్న జ్యోతిక జిమ్ లో జోరుగా వర్కౌట్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. Images and Videos Credit: Jyothika/Instagram